Friday, July 14, 2017

విశ్వరూప మ్మిదే విష్ణురూప మ్మిదే -- Viswaroopammide vishnuroopammide

విశ్వరూప మ్మిదే విష్ణురూప మ్మిదే
హరిరూపె తిరువేంకటాచలమ్ము

నిండిన మృగములే నిత్యముక్తజనమ్ము
పండిన తరులే కల్పద్రుమాలు

భావింప హరిరూపు బంగారుగోపుర
మ్మచట వ్రాలిన పక్షులమరవరులు

కోనేటిచుట్టు వైకుంఠపత్తనమెపో
యిట మాకు పొడసూపు నిహమే పరము

కోటిమదనులచెలువతో గుడిని వెలుగు
వేంకటేశ్వరుడీతడే పొంక మైన
సోమ్ము లెదపైని మంగమ్మ సోంపు గులుక
నిలిచియున్నాడు శ్రితుల ధన్యుల నొనర్ప.


గమనిక: "సోమ్ము లెదపైని మంగమ్మ సోంపు గులుక" ఈ వాక్యంలో రెండు "సో" లు కూడా పొల్లు లేకుండా చదువుకోగలరు. ఎంత ప్రయత్నించినా అలా పొల్లు లేకుండా రాయడం కుదరలేదు. క్షమించగలరు.

In English:

Viswaroopammide vishnuroopammide
hariroope thiruvenkataachalammu

nindina mrugamule nityamukthajanammu
pandina tharule kalpadhrumaalu

bhavimpa hariroopu bangaarugopura
mmachata vraalina pakshulamaravarulu

konetichuttu vaikuntapatthanamepo
yita maaku podasoopu nihame paramu

kotimadanula cheluvatho gudinin velugu
venkateswarudeethade ponkamaina
sommuledapaini mangamma sompu guluka
nilichiyunnaadu srithula dhanyula nonarpa.


నెమలిని చూచి నక్క నాట్యమాడినట్లు -- Nemalini choochi nakka naatyamaadinatlu

సామెత:

నెమలిని చూచి నక్క నాట్యమాడినట్లు. 

అర్థము:

నెమలి నాట్యం చేస్తుంటే అది చూసి నేను కూడా చేయాలి అని నక్క నాట్యం చేస్తే అది సహజంగా ఉండదు. 
ఒకరిని చూసి మన వల్ల కాకపోయినా, వారు చేసినట్లే చేయాలనుకోకూడదు.

Proverb in English:

Nemalini choochi nakka naatyamaadinatlu.


నాలుకా! నాలుకా! వీపుకు దెబ్బలు తెకే -- Nalukaa! naalukaa! veepuku debbalu theke

సామెత:

నాలుకా! నాలుకా! వీపుకు దెబ్బలు తెకే.

అర్థము:

నాలుక ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వీపు మీద దెబ్బలు పడతాయి కదా. అందుకే నాలుక అదుపులో ఉంచుకుని మాట్లాడాలి. అభిప్రాయం తెలపడం తప్పు కాదు కానీ అలా తెలపడానికి మంచి భాషను, ఎవరికీ బాధ కలగని పద్దతిని ఎంచుకోవాలి.

Proverb in English:

Nalukaa! naalukaa! veepuku debbalu theke.


తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు -- Thaadi thannevaadunte vaadi thala thanne vaadu untaadu

సామెత:

తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు.

అర్థము:

తాడి అంటే తాటి చెట్టు. తాటి చెట్టు చాలా ఎత్తుగా దాదాపు 80 అడుగులు ఉంటుంది.
అలాంటి తాటి చెట్టును కాలితో తన్నగలిగే వాడు ఉంటే మరి వాడి తలను తన్నగలిగే వాడు ఉండే అవకాశం ఉంది.
ఒకరిని మోసం చేసిన వాడిని మరొకడు మోసం చేస్తే ఆ సందర్భంలో ఈ సామెత చెప్తారు.

Proverb in English:

Thaadi thannevaadunte vaadi thala thanne vaadu untaadu.




తప్పులెన్నువారు తండోప తండంబు -- Thappulennuvaaru thanopathandambu

పద్యము:

తప్పులెన్నువారు తండోప తండంబు
లుర్విజనులకెల్ల నుండు దప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

ఎదుటివారిలో తప్పులు చూసేవారు, చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు. ఈ భూమిమీద పుట్టిన ప్రతి మనిషీ ఎదో ఒక తప్పు ఎప్పుడో ఒకప్పుడు చేస్తూనే ఉంటాడు. "నీది తప్పు, మార్చుకో" అని ఎదుటివారికి చెప్తూ ఉండేవారు తమ తప్పు ఏమిటో, తాము ఏమి మార్చుకోవాలో అని అసలు ఆలోచించరు.
అని వేమన భావం.

Poem in English:

Thappulennuvaaru thanopathandambu
lurvijanulakella nundu dhappu
thappulennuvaaru thamathappulerugaru
viswadaabhiraama vinuravema.

Meaning in English:

Vemana said:

A person who will point out the mistakes in other people, can not see their own mistakes. Every person make at least one mistake in the whole life.


పట్టుపట్టరాదు పట్టి విడువరాదు - Pattupattaraadu patti viduvaraadu

పద్యము:

పట్టుపట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియఁ బిట్టవలెను
పట్టిడుడచుకున్న బడి చచ్చుటయే మేలు
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

మూర్ఖంగా అనవసరమైన విషయాల యందు పట్టు పట్టకూడదు. ఒక మంచి పని సాధించడానికి పట్టిన పట్టు ఎట్టి పరిస్థితులలోను విడువరాదు. పట్టుదలతో ఒక మంచి పని సాధించాలి.
అని వేమన భావం.

Poem in English:

Pattupattaraadu patti viduvaraadu
patteneni bigiya bittavalenu
pattidudachukunna badi chachutuye melu
viswadaabhiraama vinuravema

Meaning in English:

Vemana said:

We are not supposed to be so stubborn in unnecessary things but should be stubborn when doing a right thing.


Thursday, July 13, 2017

చెప్పుట కంటే చేయుట మేలు -- Chepputa kante cheyuta melu

సామెత:

చెప్పుట కంటే చేయుట మేలు.

అర్థము:

ఏ నీతి అయినా పదే పదే చెప్పడం కంటే ఆచరించి చూపించుట ఉత్తమం.

Proverb in English:

Chepputa kante cheyuta melu.

Meaning in English:

It is better to conduct good than teach it all the time.


అష్ట విధ ప్రశ్నలు -- ashta vidha prasnalu

ఒక రోజు అక్బర్ చక్రవర్తి నిండు సభలో కొలువై ఉండగా, అందరినీ ఉద్దేశించి "నాకు కొన్ని సందేహాలు కలిగాయి అవి ఎనిమిది ప్రశ్నలుగా అడగదలిచాను, ఎవరైనా చెప్పగలరా?" అని అన్నారు.

అంతట ఆ సభలోని వారు రకరకాలుగా ఆలోచించసాగారు. అసలు చక్రవర్తి ఏమి అడుగుతారో, వాటికి సమాధానం చెప్పలేకపోతే అవమానపడవలసి వస్తుందని మౌనంగా ఉండిపోయారు. 

అపుడు బీర్బల్ ఈ విధంగా ఆలోచించసాగాడు "చక్రవర్తి ఏమి అడుగుతారో తెలియదు అయినప్పటికీ ప్రయత్నం చేయకపోవడమే అసలైన ఓటమి కదా! అందుచేత ముందు ప్రశ్నలు తెలుసుకోవాలి ఒకవేళ సమాదానాలు తెలియకపోతే అపుడే తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు." అని అనుకుని లేచి నిలబడి చక్రవర్తికి వందనం చేసి "ప్రభూ, ఆ ప్రశ్నలేమిటో చెప్పండి నేను సమాధానాలు చెప్పటానికి ప్రయత్నిస్తాను." అని అన్నాడు.

అపుడు చక్రవర్తి ఇలా అడగడం మొదలు పెట్టారు. 

"దానం చేసిన కొద్దీ పెరిగే సంపద ఏమిటి?"

------- విద్య, జ్ఞానం. ఇవి ఎంత ఎక్కువ దానం చేస్తే అంత పెరుగుతూ ఉంటాయి. 

"గడ్డి పరక కంటే తేలికైనది ఏమిటి?"

------- మనిషిలోని వక్ర బుద్ధి. దానికి ఇహ లోకంలో కానీ పర లోకం లో కానీ ఎలాంటి విలువ ఉండదు. 

"లోకంలోనే అతి సున్నితమైనది, సూక్ష్మమైనది ఏమిటి?"

------- మంచి బుద్ధి, ఆలోచనలు కలిగిన మనిషి మనసు. 

"గాలి కంటే వేగంగా వెళ్ళేది ఏమిటి?"

------- మనిషి మనసు. 

"నిద్రపోతూ కూడా కన్ను మూయనిది ఏమిటి?"

------- చేప. 

"నీడలా ఎప్పుడు వెన్నంటి ఉండేది ఏమిటి?"

-------- మనిషి చేసే పాపపుణ్యాలు. 

"కష్టపడిన కొద్దీ పెరిగేది ఏమిటి?"

-------- కీర్తి.

"ఏది ఎక్కువగా మనోవేదన కలిగించగలదు?"

-------- మనిషి రహస్యంగా చేసే పాప కర్మలు ఆ మనిషికి ఎక్కువ మనోవేదన కలిగిస్తాయి. 

"ఆహా! బీర్బల్ నా ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పావు." అని అక్బర్ చక్రవర్తి బీర్బల్ కి చాలా బహుమతులు ఇచ్చి సత్కరించాడు. 


Wednesday, July 12, 2017

అన్నిదానములను నన్నదానమె గొప్ప -- Annidaanamulanu nannadaaname goppa

పద్యము:

అన్నిదానములను నన్నదానమె గొప్ప
కన్నతల్లికంటే ఘనము లేదు
ఎన్నగురునికన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది. కన్న తల్లికి మించిన దైవం లేదు. తప్పులను గుర్తించి సరిచేయు గురువు కన్నా ఎక్కువ ఏమీ లేదు.
అని వేమన భావం.

Poem in English:

Annidaanamulanu nannadaaname goppa
kannathalli kante ghanamu ledu
ennagurunikanna nekkudu ledayaa
viswadaabhiraama vinuravema.

Meaning in English:

Vemana said:

Donating food is the best help. Mother is the most dearest one who is equal to god. A teacher who tells you your mistakes and support to rectify them, is the best one.


ఆత్మశుద్ధి లేని యాచార మదియేల -- Aatma sudhi leni yacharamadiyela

పద్యము:

ఆత్మశుద్ధి  లేని యాచారమదియేల?

భాండశుద్ధి లేని పాకమేల?
చిత్త శుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:


ఆత్మ, మనసు మంచి ఆలోచనలతో లేకుండా ఆచారాలు పాటించడం ఎందుకు?

వంట చేసేటపుడు పాత్ర శుభ్రంగా లేకపోతే వంట చేయడమెందుకు?
చిత్తం అనగా మనసు లోని ఆలోచనలు, బుద్ధి నిర్మలంగా లేకపోతే శివ పూజ చేయడం ఎందుకు?
చక్కగా, నిజాయితీగా చేయని ఏ పని వల్ల కూడా సత్ఫలితం పొందలేము.
అని వేమన భావం .

Poem in English:


Aathma sudhi leni yacharamadiyela

bhanda sudhi leni paakamela
chittha sidhi leni siva poojalelaraa
viswadabhi raama vinura vema

Meaning in English:


Vemana said:


There is no reason to follow all rituals when your heart and soul are not good.

There is no reason to cook when the utensil is not cleaned.
With out a good heart and good thoughts, there is no use in making prayers to god.
Be honest and humble all the time.