అక్బర్ చక్రవర్తికి ఒకరోజు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు పళ్ళన్నీ రాలిపోయినట్లు, నోరు బోసిగా ఉన్నట్లు, తనకు నమలడం కష్టమైనట్లు కనిపించింది.
మరునాడు నిండు సభలో తమ ఆస్థాన జ్యోతిష్కుడిని ఈ వింత కలకి ఫలితం ఏమిటి అని అడిగాడు.
స్వప్న శాస్త్రంలో నిష్ణాతుడైన ఆ జ్యోతిష్కుడు "ప్రభూ! ఇది చాలా చెడ్డ కల. మీ కళ్ళ ముందే అయిన వారి మరణం చూడవలిసి వస్తుంది. ఈ కలకు ఫలితం ఇదే."
అది విన్న చక్రవర్తికి ఒక్కసారిగా కోపం వచ్చింది. అక్కడ ఉన్న భటులను పిలిచి ఆ జ్యోతిష్కుడిని బంధించమని చెప్తాడు.
ఇదంతా గమనిస్తున్న బీర్బల్ లేచి "ఆగండి ప్రభూ! ఆ జ్యోతిష్కుడు చెప్పింది తప్పు. ఆ కలకు ఫలితం మీ బంధువులందరి కన్నా మీ ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది అని" అని చెప్పాడు.
అపుడు చక్రవర్తికి తన తప్పు తెలిసింది. ఆ జ్యోతిష్కుడిని వదిలివేయమని భటులకు చెప్పి, జ్యోతిష్కుడిని క్షమాపణ కోరాడు.
తర్వాత బీర్బల్ తో "చెప్పే విషయం ఏదైనా మనసుకు కష్టం కలగని రీతిలో చెప్పాలని మీ ద్వారా తెలుసుకున్నాను" అని బీర్బల్ ని కానుకలతో సత్కరించాడు.

No comments:
Post a Comment