Showing posts with label సామెతలు - Saamethalu. Show all posts
Showing posts with label సామెతలు - Saamethalu. Show all posts

Monday, July 17, 2017

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది -- Noru manchidayithe ooru manchidi avuthundi

సామెత:

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది.

అర్థము:

మాట్లాడే మాటలు చక్కగా, ఎవరికీ బాధ కలిగించకుండా ఉంటే ఊరిలో ఎవరితోనూ ఏ గొడవా రాదు.

Proverb in English:

Noru manchidayithe ooru manchidi avuthundi.


Sunday, July 16, 2017

తింటే ఆయాసం, తినకపోతే నీరసం -- Thinte aayaasam, thinakapothe neerasam

సామెత:

తింటే ఆయాసం, తినకపోతే నీరసం.

అర్థము:

కొంచెం ఎక్కువ ఆహారం తింటే అరిగించుకోలేక ఆయాసం వస్తుంది. ఆలా అని సరిపడినంత తినకపోతే నీరసం వస్తుంది.
ఏదైనా ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే అని చెప్పే సందర్భములో ఈ సామెత చెప్తారు.

Proverb in English:

Thinte aayaasam, thinakapothe neerasam.


Friday, July 14, 2017

నెమలిని చూచి నక్క నాట్యమాడినట్లు -- Nemalini choochi nakka naatyamaadinatlu

సామెత:

నెమలిని చూచి నక్క నాట్యమాడినట్లు. 

అర్థము:

నెమలి నాట్యం చేస్తుంటే అది చూసి నేను కూడా చేయాలి అని నక్క నాట్యం చేస్తే అది సహజంగా ఉండదు. 
ఒకరిని చూసి మన వల్ల కాకపోయినా, వారు చేసినట్లే చేయాలనుకోకూడదు.

Proverb in English:

Nemalini choochi nakka naatyamaadinatlu.


నాలుకా! నాలుకా! వీపుకు దెబ్బలు తెకే -- Nalukaa! naalukaa! veepuku debbalu theke

సామెత:

నాలుకా! నాలుకా! వీపుకు దెబ్బలు తెకే.

అర్థము:

నాలుక ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వీపు మీద దెబ్బలు పడతాయి కదా. అందుకే నాలుక అదుపులో ఉంచుకుని మాట్లాడాలి. అభిప్రాయం తెలపడం తప్పు కాదు కానీ అలా తెలపడానికి మంచి భాషను, ఎవరికీ బాధ కలగని పద్దతిని ఎంచుకోవాలి.

Proverb in English:

Nalukaa! naalukaa! veepuku debbalu theke.


తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు -- Thaadi thannevaadunte vaadi thala thanne vaadu untaadu

సామెత:

తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు.

అర్థము:

తాడి అంటే తాటి చెట్టు. తాటి చెట్టు చాలా ఎత్తుగా దాదాపు 80 అడుగులు ఉంటుంది.
అలాంటి తాటి చెట్టును కాలితో తన్నగలిగే వాడు ఉంటే మరి వాడి తలను తన్నగలిగే వాడు ఉండే అవకాశం ఉంది.
ఒకరిని మోసం చేసిన వాడిని మరొకడు మోసం చేస్తే ఆ సందర్భంలో ఈ సామెత చెప్తారు.

Proverb in English:

Thaadi thannevaadunte vaadi thala thanne vaadu untaadu.




Thursday, July 13, 2017

చెప్పుట కంటే చేయుట మేలు -- Chepputa kante cheyuta melu

సామెత:

చెప్పుట కంటే చేయుట మేలు.

అర్థము:

ఏ నీతి అయినా పదే పదే చెప్పడం కంటే ఆచరించి చూపించుట ఉత్తమం.

Proverb in English:

Chepputa kante cheyuta melu.

Meaning in English:

It is better to conduct good than teach it all the time.


Wednesday, July 12, 2017

కలిమిలేములు కావడి కుండలు - Kalimilemulu kaavadi kundalu

సామెత:

కలిమిలేములు కావడి కుండలు

అర్థము:

మంచి-చెడులు, సంపద ఉండడం-లేకపోవడం అనేవి కావడికి కట్టబడే రెండు కుండలవంటివి. కావడికి కట్టబడే రెండు కుండలూ సమానమైన బరువు కలిగి ఉంటేనే ఆ కావడి మోసే మనిషికి సౌకర్యంగా ఉంటుంది. లేకపోతే వెనుకకో, ముందుకో పడిపోతాడు. అలాగే మనిషి జీవితంలో మంచి-చెడు, సుఖం-కష్టం రెండూ ఉంటాయి. అపుడే మనిషికి మంచి విలువ, సుఖం విలువ తెలుస్తుంది.

Proverb in English:

Kalimilemulu kaavadi kundalu

Meaning in English:

Good - Bad, richness- poorness are two things which will be in balance in human life. Then only we will know the value of good and richness. "Kaavadi" means a strong wood stick which has two ends to bear the weight on a person's shoulder. It should be balanced with weight on both sides to make it comfortable to bear the weight for that person.


Tuesday, July 11, 2017

ఆడింది ఆట పాడింది పాట -- Aadindi aata paadindi paata

సామెత:

ఆడింది ఆట పాడింది పాట

అర్థము:

ఒక మనిషి ఏ పని చేసినా అతని స్థానబలం వల్ల చెల్లుబాటు అవుతుంటే ఆ సందర్భంలో ఈ సామెత చెప్తారు.

Proverb in English:

Aadindi aata paadindi paata

Meaning in English:

They say it when everything is acceptable by a person because of his position or economic status.




Wednesday, July 5, 2017

అభ్యాసము కూసు విద్య - Abhyaasam koosu vidya

సామెత:

అభ్యాసము కూసు విద్య

అర్థము:

ఏ అభ్యాసం అయినా, చదువు అయినా చిన్న వయసులోనే మొదలుపెట్టుట మంచిది.

Proverb in English:

Abhyaasam koosu vidya

Meaning in English:

It is better to start learning anything at early age.

ప్రతి పద అర్ధం / Meaning for every word:

అభ్యాసం Abhyaasam - ప్రతీ రోజూ చేసేది, చదువు, వ్యాయామం లాంటివి -- Practice
కూసు koosu - శిశువు, చిన్న పిల్లవాడు లేదా చిన్న పాప -- Small aged kid
విద్య vidya - చదువు, నేర్చుకునేది - Education, Activity