Showing posts with label వేమన పద్యాలు - Vemana Padyaalu. Show all posts
Showing posts with label వేమన పద్యాలు - Vemana Padyaalu. Show all posts

Wednesday, July 19, 2017

అనువుగాని చోట నధికుల మనరాదు -- Anuvugaani chota nadhikula manaraadu

పద్యము:

అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచెమైన నదియు గొదువగాదు
కొండ యద్దమందుఁ గొంచెమైయుండదా!
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

ఒక పెద్ద కొండ ముందు అద్దం పెట్టి చూస్తే ఆ కొండ చిన్నగా కనిపించినా ఆ కొండ నిజానికి పెద్దదే కదా. అలాగే మనది కాని సమయంలో అయినా, ప్రదేశం లో అయినా గొప్పతనము చూపకూడదు. అలా ఉన్నంతమాత్రాన మన గొప్పదనమేమి తగ్గిపోదు.
అని వేమన భావం.

Poem in English:

Anuvugaani chota nadhikula manaraadu
konchemaina nadiyu godhuva gaadu
konda yaddhamandu gonchemaiyundadhaa!
viswadaabhiraama vinuravema.

Meaning in English:

If we see a hill in a mirror, it will look like a small stone but still it is a big hill. We shouldn't show our knowledge or greatness when time or place is not ours.


Tuesday, July 18, 2017

వాన కురియకున్న వచ్చును క్షామంబు -- Vaana kuriyakunna vachunu kshaamambu

పద్యము:

వాన కురియకున్న వచ్చును క్షామంబు
వాన కురిసెనేని వరదపారు
వరద కరవు రెండు వరసతో నెఱుగుడీ
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

వాన కురవకపోతే కరువు వస్తుంది. వాన ఎక్కువగా కురిస్తే వరద వస్తుంది. వాన సరిపడినంత కురిస్తేనే పంటలు చక్కగా పండుతాయి. అలాగే ఏ విషయంలోనైనా సమతుల్యత ఉండాలి. ఏదీ ఎక్కువ, తక్కువ ఉండడం వలన సరైన ఫలితం రాదు.
అని వేమన భావం.

Padyamu in English:

Vaana kuriyakunna vachunu kshaamambu
vaana kurisenenei varadapaaru
varada karavu rendu varasatho nerugudee
viswadaabhiraama vinuravema.

Meaning in English:

Vemana said:

We need enough rain to get good crop. Everything should be in balance to get good result.


Monday, July 17, 2017

చంపదగినయట్టి శత్రువు తనచేత -- Champadaginayatti satruvu thanacheta

పద్యము:

చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కినేని గీడు సేయరాదు
పొసఁగ మేలుచేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

చంపదగిన శత్రువు అయినా చేతికి దొరికినపుడు వీలైతే క్షమించి వదిలిపెట్టాలి. ఇంకా వీలైతే ఏదైనా సహాయం చేసి పంపించాలి. ఎందువల్లనంటే శత్రువు లేకుండా చేసుకోవాలి అంటే మార్గం శత్రువును చంపడం కాదు ఆ మనిషిలోని శతృత్వపు భావాన్ని చంపడం. అది ప్రేమ, సహాయాలతోనే సాధ్యమవుతుంది.
అని వేమన భావం.

Poem in English:

Champadaginayatti satruvu thanacheta
jikkineni geedu seyaraadu
posaga meluchesi pommanute chaalu
viswadaabhiraama vinuravema

Meaning in English:

Vemana said:

It is always best thing to forgive an enemy. Because to end enmity, we need to end the enmity not the person.


Sunday, July 16, 2017

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు -- Anaga nanaga raaga mathisayilluchunundu

పద్యము:

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
దినగ దినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

పాడగా, పాడగా రాగం చక్కగా కుదురుతుంది. వేపాకు రోజు తింటూ ఉంటే ఏదో ఒక రోజు ఆ చేదు తెలియదు. ఈ లోకంలో అన్ని పనులు సాధన చేయడం ద్వారా సాధ్యపడతాయి.

అని వేమన భావం.

Poem in English:

Anaga nanaga raaga mathisayilluchunundu
dinaga dinaga vemu thiyyanundu
saadanamuna panulu samakooru dharalona
viswadaabhiraama vinuravema

Meaning in English:

Vemana said:

If we practice singing everyday, one day we will get the perfect voice and tune. if we eat a neem leaf everyday, one day we don't feel the bitter taste. If we practice regularly, we will become an expert in any task.



Friday, July 14, 2017

తప్పులెన్నువారు తండోప తండంబు -- Thappulennuvaaru thanopathandambu

పద్యము:

తప్పులెన్నువారు తండోప తండంబు
లుర్విజనులకెల్ల నుండు దప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

ఎదుటివారిలో తప్పులు చూసేవారు, చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు. ఈ భూమిమీద పుట్టిన ప్రతి మనిషీ ఎదో ఒక తప్పు ఎప్పుడో ఒకప్పుడు చేస్తూనే ఉంటాడు. "నీది తప్పు, మార్చుకో" అని ఎదుటివారికి చెప్తూ ఉండేవారు తమ తప్పు ఏమిటో, తాము ఏమి మార్చుకోవాలో అని అసలు ఆలోచించరు.
అని వేమన భావం.

Poem in English:

Thappulennuvaaru thanopathandambu
lurvijanulakella nundu dhappu
thappulennuvaaru thamathappulerugaru
viswadaabhiraama vinuravema.

Meaning in English:

Vemana said:

A person who will point out the mistakes in other people, can not see their own mistakes. Every person make at least one mistake in the whole life.


పట్టుపట్టరాదు పట్టి విడువరాదు - Pattupattaraadu patti viduvaraadu

పద్యము:

పట్టుపట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియఁ బిట్టవలెను
పట్టిడుడచుకున్న బడి చచ్చుటయే మేలు
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

మూర్ఖంగా అనవసరమైన విషయాల యందు పట్టు పట్టకూడదు. ఒక మంచి పని సాధించడానికి పట్టిన పట్టు ఎట్టి పరిస్థితులలోను విడువరాదు. పట్టుదలతో ఒక మంచి పని సాధించాలి.
అని వేమన భావం.

Poem in English:

Pattupattaraadu patti viduvaraadu
patteneni bigiya bittavalenu
pattidudachukunna badi chachutuye melu
viswadaabhiraama vinuravema

Meaning in English:

Vemana said:

We are not supposed to be so stubborn in unnecessary things but should be stubborn when doing a right thing.


Wednesday, July 12, 2017

అన్నిదానములను నన్నదానమె గొప్ప -- Annidaanamulanu nannadaaname goppa

పద్యము:

అన్నిదానములను నన్నదానమె గొప్ప
కన్నతల్లికంటే ఘనము లేదు
ఎన్నగురునికన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది. కన్న తల్లికి మించిన దైవం లేదు. తప్పులను గుర్తించి సరిచేయు గురువు కన్నా ఎక్కువ ఏమీ లేదు.
అని వేమన భావం.

Poem in English:

Annidaanamulanu nannadaaname goppa
kannathalli kante ghanamu ledu
ennagurunikanna nekkudu ledayaa
viswadaabhiraama vinuravema.

Meaning in English:

Vemana said:

Donating food is the best help. Mother is the most dearest one who is equal to god. A teacher who tells you your mistakes and support to rectify them, is the best one.


ఆత్మశుద్ధి లేని యాచార మదియేల -- Aatma sudhi leni yacharamadiyela

పద్యము:

ఆత్మశుద్ధి  లేని యాచారమదియేల?

భాండశుద్ధి లేని పాకమేల?
చిత్త శుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:


ఆత్మ, మనసు మంచి ఆలోచనలతో లేకుండా ఆచారాలు పాటించడం ఎందుకు?

వంట చేసేటపుడు పాత్ర శుభ్రంగా లేకపోతే వంట చేయడమెందుకు?
చిత్తం అనగా మనసు లోని ఆలోచనలు, బుద్ధి నిర్మలంగా లేకపోతే శివ పూజ చేయడం ఎందుకు?
చక్కగా, నిజాయితీగా చేయని ఏ పని వల్ల కూడా సత్ఫలితం పొందలేము.
అని వేమన భావం .

Poem in English:


Aathma sudhi leni yacharamadiyela

bhanda sudhi leni paakamela
chittha sidhi leni siva poojalelaraa
viswadabhi raama vinura vema

Meaning in English:


Vemana said:


There is no reason to follow all rituals when your heart and soul are not good.

There is no reason to cook when the utensil is not cleaned.
With out a good heart and good thoughts, there is no use in making prayers to god.
Be honest and humble all the time.

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు -- Gangi govu paalu garitedainanu chaalu

పద్యము:

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైననుచాలు,
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

మంచి ఆవు పాలు కొన్ని ఉన్నా చాలు. గాడిద పాలు ఎన్ని ఉన్నా ఆవు పాలకు సమానం కావు.
రకరకాల ఆహార పదార్ధాలతో వండిన విందు భోజనం కంటే సాత్వికమైనది, దేవుని పై భక్తి కలిగించేది అయినది కొంచెం ఆహారం చాలు.
అని వేమన భావం.

Poem in English:

Gangigovu paalu garitedainanu chaalu
kadivedainanemi kharamu paalu
bhakthi kalugu koodu pattedainanu chaalu,
viswadabhiraama vinuravema

Meaning in English:


Vemana said:


There are so many things we can do with cow's milk so even we have a small amount of cow's milk it is better than lot of donkey's milk. It is better to have small amount of food which makes us soft, humble and devoted to god than a lot of food.



పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు -- Pooja kanna nencha buddhi pradaanambu

పద్యము:

పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు
మాటకన్న నెంచ మనుసు దృఢము
కులముకన్న మిగులు గుణము ప్రధానంబు,
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

ఎప్పుడూ పూజలు చేయుట కంటే మంచి బుద్ధి, మనసు కలిగిఉండుట మంచిది. ఎవరినీ నొప్పించక ఉండి పూజ చేయుట ఇంకా మేలు. ఇచ్చిన మంచి మాట మీద నిలబడడము వలన మంచి ఫలితము కలుగును. పుట్టిన కులము కంటే మంచి గుణము చూసి గౌరవించవలెను. మంచి గుణమే ముఖ్యమైనది.
అని వేమన భావం.

Poem in English:

Pooja kanna nencha buddhi pradaanambu
maata kanna nencha manusu drudamu
kulamu kanna migulu gunamu pradaanambu,
viswadaabhiraama vinuravema.

Meaning in English:

Vemana said:

It is better to have a good, helpful heart than doing prayers all the time. It is better to keep a good promise which earns more respect. Good heart is the only important thing not the birth place or family.


Tuesday, July 11, 2017

చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు -- Chittha sudhi kaligi chesina punyambu

పద్యము:

చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియుఁకొదువ కాదు
విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

మంచి మనసుతో చేసిన ఎంత చిన్న పనైనా మంచి ఫలితమిస్తుంది. విత్తనము ఎంత చిన్నదైనా అది పెద్ద మర్రి చెట్టుగా ఎదుగుతుంది కదా..
అని వేమన భావం.

Poem in English:

Chittha sudhi kaligi chesina punyambu
konchemaina nadiyu koduva kaadu
vithanambu marrivrukshambunaku nentha
viswadabhi raama vinuravema.

Meaning in English:

Vemana said:

Manchi manasutho chesina entha chinnaa panainaa manchi phalithamisthundi. Vithanamu chinnadaina adi pedda marri chettuga eduguthundi kada.

Monday, July 10, 2017

కులములోన నొకఁడు గుణవంతుడుండిన -- Kulamulona nokadu gunavanthudundina

పద్యము:

కులములోన నొకఁడు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణముచేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

వంశం మొత్తానికి ఒక్కడు మంచి నియమాలను పాటిస్తూ, ఎవరికీ అపకారం తల పెట్టని వాడు ఉంటే అతని వలన ఆ వంశమే తరిస్తుంది. పెద్ద అడవిలో ఒక్క చందనపు చెట్టు ఉన్నా ఆ అడవి మొత్తం సువాసన తో నిండి పోతుంది కదా.
అని వేమన భావం.

వెలయు అంటే ప్రకాశించు అని అర్థము.
మలయజము అంటే చందనపు చెట్టు అని అర్థము.

Poem in English:

Kulamulona nokadu gunavanthudundina
kulamu velayu vaani gunamuchetha
velayu vanamulona malayajambunnatlu
viswadabhiraama vinuravema.

Meaning in English:

Vemana said:

If there is a good person in the whole family, the whole family will get good fortune. If there is one sandalwood tree in a big forest, it will spread it's nice scent to the whole forest.


నేరనన్న వాఁడు నెరజాణ మహిలోన -- Nerananna vaadu nerajana mahilona

పద్యము:

నేరనన్న వాఁడు నెరజాణ మహిలోన
నేరునన్న వాఁడు నిందజెందు
ఊరుకున్నవాడే యుత్తమయోగిరా!
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

ఈ లోకంలో,
నేను నేర్చుకోను, చదువుకోను అనేవాడు అవసరం అయినపుడు ఎటు వీలైతే అటు మాట్లాడుతూ ఉంటాడు, నిజానికి ఏమీ తెలియనివాడు. ఇలాంటి వాడికి తగిన గౌరవం లభించదు.
నేను అన్నీ నేర్చుకున్నాను ఇక నేర్చుకోవలిసింది ఏమీ లేదు అని అనుకునేవాడు ఎప్పుడో ఒకప్పుడు అవమానపడతాడు. ఎందువల్లనంటే ఎంతటివారికైనా తెలియని విషయం ఎదో ఒకటి ఉంటుంది.
తగిన సందర్భంలో మౌనంగా ఉండి విషయాలను చక్కగా నేర్చుకునేవాడు ఎప్పటికీ గౌరవం పొందుతూనే ఉంటాడు.
అని వేమన భావం.

Poem in English:

Nerananna vaadu nerajaana mahilona
nerunanna vaadu nindajendu
oorukunna vaadu yuthama yogiraa
viswadabhi raama vinuravema

Meaning in English:

Vemana said:

In this world,
A person who says "I don't learn anything", will never earn enough respect because he always talk nonsense due to lack of knowledge.
A person who says "I know everything, there is nothing left for me to learn", will also never get enough respect because he may get a situation where his knowledge is not enough.
A person who keep calm and try to learn when he does not know anything about the current topic, will get enough respect.


Saturday, July 8, 2017

గంగ పారునెపుడు గదలని గతితోడ -- Ganga paarunepudu gadalani gathithoda

పద్యము:

గంగ పారునెపుడు గదలని గతితోడ
మురికివాగు పారు మోత తోడ
పెద్దపిన్నతనము పేర్మియీలాగురా,
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థం:

స్వచ్చంగా ఉండే గంగానది ఎప్పుడూ  నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, హుందాగా పారుతూ ఉంటుంది.
అదే ఒక మురికి కాలువ చెత్త చెదారంతో, ఈగలు, దోమలు మొదలైన వాటితో గందరగోళంగా ఉంటుంది.
అలాగే, అంతా నాకే తెలుగు అని ఎగిరెగిరి పడకుండా అన్ని సందర్భములలోనూ పెద్ద వారిని గౌరవిస్తూ, చిన్న వారిని లాలిస్తూ ప్రశాంతంగా, హుందాగా నడుచుకోవాలి.
అని వేమన భావం.

Poem in English:

Ganga paarunepudu gadalani gathithoda
murikivaagu paaru motha thoda
peddapinnathanamu permieelaaguraa,
viswadaabhiraama vinuravema.

Meaning in English:

The sacred river ganga flows quietly, calmly but a dirty canal flows with all the flies around it which makes a lot of noise. We should respect elderly and love younger in all times. We should behave properly and keep dignity all the time.


Friday, July 7, 2017

మేడి పండు చూడ మేలిమై యుండు -- Medi pandu chooda melimai yundu

పద్యము:

మేడి పండు చూడ మేలిమై యుండు
పొట్ట విప్పి చూడ పురుగులుండు
పిఱికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

మేడి పండు పైకి చక్కగా కనిపించినప్పటికీ దానిలో పురుగులుండే అవకాశం ఉంది.
అలాగే పిఱికి వాడు పైకి బింకం ప్రదర్శించినప్పటికీ అతని మనసులో భయం ఉంటుంది.
అని వేమన భావం.

Poem in English:

Medi pandu chooda melimai yundu
potta vippi chooda purugulundu
piriki vaani madini binkameelaaguraa
viswadabhiraama vinura vema

Meaning in English:

Vemana said:

If you think of a fruit which you could see very nice and neat from the outer side but it may have bugs inside. A coward person may look still but he may have fear in his heart.