Wednesday, July 19, 2017

అనువుగాని చోట నధికుల మనరాదు -- Anuvugaani chota nadhikula manaraadu

పద్యము:

అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచెమైన నదియు గొదువగాదు
కొండ యద్దమందుఁ గొంచెమైయుండదా!
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

ఒక పెద్ద కొండ ముందు అద్దం పెట్టి చూస్తే ఆ కొండ చిన్నగా కనిపించినా ఆ కొండ నిజానికి పెద్దదే కదా. అలాగే మనది కాని సమయంలో అయినా, ప్రదేశం లో అయినా గొప్పతనము చూపకూడదు. అలా ఉన్నంతమాత్రాన మన గొప్పదనమేమి తగ్గిపోదు.
అని వేమన భావం.

Poem in English:

Anuvugaani chota nadhikula manaraadu
konchemaina nadiyu godhuva gaadu
konda yaddhamandu gonchemaiyundadhaa!
viswadaabhiraama vinuravema.

Meaning in English:

If we see a hill in a mirror, it will look like a small stone but still it is a big hill. We shouldn't show our knowledge or greatness when time or place is not ours.


Tuesday, July 18, 2017

కల ఫలితం -- Kala Phalitham

అక్బర్ చక్రవర్తికి ఒకరోజు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు పళ్ళన్నీ రాలిపోయినట్లు, నోరు బోసిగా ఉన్నట్లు, తనకు నమలడం కష్టమైనట్లు కనిపించింది.

మరునాడు నిండు సభలో తమ ఆస్థాన జ్యోతిష్కుడిని ఈ వింత కలకి ఫలితం ఏమిటి అని అడిగాడు.

స్వప్న శాస్త్రంలో నిష్ణాతుడైన ఆ జ్యోతిష్కుడు "ప్రభూ! ఇది చాలా చెడ్డ కల. మీ కళ్ళ ముందే అయిన వారి మరణం చూడవలిసి వస్తుంది. ఈ కలకు ఫలితం ఇదే."

అది విన్న చక్రవర్తికి ఒక్కసారిగా కోపం వచ్చింది. అక్కడ ఉన్న భటులను పిలిచి ఆ జ్యోతిష్కుడిని బంధించమని చెప్తాడు.

ఇదంతా గమనిస్తున్న బీర్బల్ లేచి "ఆగండి ప్రభూ! ఆ జ్యోతిష్కుడు చెప్పింది తప్పు. ఆ కలకు ఫలితం మీ బంధువులందరి కన్నా మీ ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది అని" అని చెప్పాడు.

అపుడు చక్రవర్తికి తన తప్పు తెలిసింది. ఆ జ్యోతిష్కుడిని వదిలివేయమని భటులకు చెప్పి, జ్యోతిష్కుడిని క్షమాపణ కోరాడు.

తర్వాత బీర్బల్ తో "చెప్పే విషయం ఏదైనా మనసుకు కష్టం కలగని రీతిలో చెప్పాలని మీ ద్వారా తెలుసుకున్నాను" అని బీర్బల్ ని కానుకలతో సత్కరించాడు.


వాన కురియకున్న వచ్చును క్షామంబు -- Vaana kuriyakunna vachunu kshaamambu

పద్యము:

వాన కురియకున్న వచ్చును క్షామంబు
వాన కురిసెనేని వరదపారు
వరద కరవు రెండు వరసతో నెఱుగుడీ
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

వాన కురవకపోతే కరువు వస్తుంది. వాన ఎక్కువగా కురిస్తే వరద వస్తుంది. వాన సరిపడినంత కురిస్తేనే పంటలు చక్కగా పండుతాయి. అలాగే ఏ విషయంలోనైనా సమతుల్యత ఉండాలి. ఏదీ ఎక్కువ, తక్కువ ఉండడం వలన సరైన ఫలితం రాదు.
అని వేమన భావం.

Padyamu in English:

Vaana kuriyakunna vachunu kshaamambu
vaana kurisenenei varadapaaru
varada karavu rendu varasatho nerugudee
viswadaabhiraama vinuravema.

Meaning in English:

Vemana said:

We need enough rain to get good crop. Everything should be in balance to get good result.


Monday, July 17, 2017

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది -- Noru manchidayithe ooru manchidi avuthundi

సామెత:

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది.

అర్థము:

మాట్లాడే మాటలు చక్కగా, ఎవరికీ బాధ కలిగించకుండా ఉంటే ఊరిలో ఎవరితోనూ ఏ గొడవా రాదు.

Proverb in English:

Noru manchidayithe ooru manchidi avuthundi.


చంపదగినయట్టి శత్రువు తనచేత -- Champadaginayatti satruvu thanacheta

పద్యము:

చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కినేని గీడు సేయరాదు
పొసఁగ మేలుచేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

చంపదగిన శత్రువు అయినా చేతికి దొరికినపుడు వీలైతే క్షమించి వదిలిపెట్టాలి. ఇంకా వీలైతే ఏదైనా సహాయం చేసి పంపించాలి. ఎందువల్లనంటే శత్రువు లేకుండా చేసుకోవాలి అంటే మార్గం శత్రువును చంపడం కాదు ఆ మనిషిలోని శతృత్వపు భావాన్ని చంపడం. అది ప్రేమ, సహాయాలతోనే సాధ్యమవుతుంది.
అని వేమన భావం.

Poem in English:

Champadaginayatti satruvu thanacheta
jikkineni geedu seyaraadu
posaga meluchesi pommanute chaalu
viswadaabhiraama vinuravema

Meaning in English:

Vemana said:

It is always best thing to forgive an enemy. Because to end enmity, we need to end the enmity not the person.


పొత్తుల బవళించె బురుషోత్తముడు తొల్లి - Pothula bavalinche burushothamudu tholli

పొత్తుల బవళించె బురుషోత్తముడు తొల్లి
పరంగ మర్రాకు పై బండినట్లు

కృష్ణమ్మ తా నోతగిలి బోరగిలసాగె
కూర్మావతారమై కోరలినట్లు

తప్పటడుగు లీడ దగ ద్రివిక్రముడౌచు
నిలను పాదాలతో గొలిచినట్లు

అప్పుడే కొదలు మాటాడజొచ్చె మురారి
త్రిపురకాంతలకు బోధించినట్లు

ఆడదొడగెను వ్రేపల్లెవాడలోన
మెచ్చులా వికుంఠపురమందు మెఱసినట్లు
పన్నగాచలానిలయుడై యున్నవాడు
అచ్చుగా జీవులం దాత్మ యైనట్లు

In English:

Poththula bavalinche burushoththamudu tholli
paranga marraaku pai bandinatlu

krushnamma thaa nothagili boragila saage
koormaavathaaramai koralinatlu

thappatadugu leeda dhaga drivikramudouchu
nilanu paadhaalatho golichinatlu

appude kodhalu maatadajochche muraari
thripurakaanthalaku bodhinchinatlu

aadadhodagenu vrepallevaadalona
mechchulaa vikuntapuramandu merasinatlu
pannagaachalaa nilayudai yunnavaadu
achchugaa jeevulam dhaatma yainatlu.


Sunday, July 16, 2017

తింటే ఆయాసం, తినకపోతే నీరసం -- Thinte aayaasam, thinakapothe neerasam

సామెత:

తింటే ఆయాసం, తినకపోతే నీరసం.

అర్థము:

కొంచెం ఎక్కువ ఆహారం తింటే అరిగించుకోలేక ఆయాసం వస్తుంది. ఆలా అని సరిపడినంత తినకపోతే నీరసం వస్తుంది.
ఏదైనా ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే అని చెప్పే సందర్భములో ఈ సామెత చెప్తారు.

Proverb in English:

Thinte aayaasam, thinakapothe neerasam.


అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు -- Anaga nanaga raaga mathisayilluchunundu

పద్యము:

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
దినగ దినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ.

అర్థము:

పాడగా, పాడగా రాగం చక్కగా కుదురుతుంది. వేపాకు రోజు తింటూ ఉంటే ఏదో ఒక రోజు ఆ చేదు తెలియదు. ఈ లోకంలో అన్ని పనులు సాధన చేయడం ద్వారా సాధ్యపడతాయి.

అని వేమన భావం.

Poem in English:

Anaga nanaga raaga mathisayilluchunundu
dinaga dinaga vemu thiyyanundu
saadanamuna panulu samakooru dharalona
viswadaabhiraama vinuravema

Meaning in English:

Vemana said:

If we practice singing everyday, one day we will get the perfect voice and tune. if we eat a neem leaf everyday, one day we don't feel the bitter taste. If we practice regularly, we will become an expert in any task.



తలంచినప్పుడు వచ్చు దయ యెప్పుడు దలంచు -- Thalanchinappudu vachu daya yeppudu dalanchu

తలంచినప్పుడు వచ్చు దయ యెప్పుడు దలంచు
కలసినబంధువు కమలనేత్రుం 

డాత్మలోననే యుండు నన్నిట బాయఁడే 
మేమైన దా నిచ్చు నివల నవలం 

జేయు కర్మమ్ముల జెడనీయం డెన్నండు
నాతురబంధువు హరి యొకండె 

నిచ్చ విందులు వెట్టు నెలతల నొడఁగూర్పు 
నిచ్చయెఱిగి కోక లిచ్చుదాల్ప 

మెచ్చు నేమిటి కైన ఇచ్చినట్టివి గొను
ముచ్చటౌ బంధువు మురహరుండె  

తోడునీడయై నెఱపించు దొరతనంబు 
నింద్రియమ్ముల బంపుసేయించు గూర్మి 
నిత్యసంసారమందున నిద్ర దెలుపు
వేడుకౌ బంధువు వృషాద్రివిభుండొకండె

In English:

Thalanchinappudu vachu dhaya yeppudu dhalanchu
kalasina bandhuvu kamalanetrum

daathmalonane yundu nannita baayade
memaina dhaa nichchu nivala navalm

jeyu karmammula jedaneeyam dennandu
naathurabandhuvu hari yokande

nichcha vindulu vettu nelathala nodagoorpu
nichchayerigi koka lichchu dhaalpa

mechchunemiti kaina ichchinattivi gonu
muchchatao bandhuvu muraharunde

thoduneedayai nerapinchu dhorathanambu
nindriyammula bampuseyinchu goormi
nityasamsaaramandhuna nidhra dhelupu
vedukao bandhuvu vrushaadhrivibhundokande



Saturday, July 15, 2017

ఇలవేలు పీతడే యిందఱకును మఱి -- Ilavelupeethade yindarukunu mari

ఇలవేలు పీతడే యిందఱకును మఱి
పలు వేలుపులతోడ బని యికేల?

కమలామనోవిభు  కరుణాఫలముగాదె
యమరులు గొనియాడు నమృతరసము?

దనుజాంతకుని బొడ్డుదామరాయే  గదా
జననకారణ మాయె సర్వమునకు

సరసిజనేత్రుని నతిమహిమయె గదా
యఖిలభూముల నిండినట్టి సిరులు?

అతనిసుతు రచనయెగదా సతులు పతులు
జరుపు సంసారరతి ప్రాణిజాత ముండు
నెల వతనిదేగదా! వృషాచలము శ్రీవి
కుంఠమేగద! యితడెగా కొండలప్ప!

In English:

Ilavelu peethade yindharakunu mari
palu velupulathoda bani yikela?

kamalaamanovibhu karunaaphalamugaade
yamarulu goniyaadu namrutharasamu?

dhanujaanthakuni boddudhaamaraaye gadhaa
jananakaarana maaye sarvamunaku

sarasijanetruni nathimahimaye gadhaa
yakhilabhoomula nindinatti sirulu?

athanisuthu rachanayegadhaa sathulu pathulu
jarupu samsaara rathi praanijaatha mundu
nela vathanide gadhaa! vrushaachalamu sreevi
kuntame gadhaa! yithadegaa kondalappa!